India: 3013 సంవత్సరంలో ప్రయాణానికి టికెట్ జారీ చేసి.. ప్రయాణికుడిని ఇబ్బంది పెట్టిన రైల్వేకు ఫోరం మొట్టికాయలు!

  • వెయ్యి సంవత్సరాల తరువాతి డేట్ తో టికెట్
  • ప్రయాణికుడిని బలవంతంగా దించేసిన టీటీఈ
  • ఆగ్రహం వ్యక్తం చేస్తూ జరిమానా విధించిన వినియోగదారుల ఫోరం

మీరు 3013, నవంబర్ 19న రైల్లో ప్రయాణించగలరా? వెయ్యి సంవత్సరాల తరువాత ప్రయాణం సాధ్యమేనా? అప్పటి ప్రయాణానికి ఇప్పుడే టికెట్ ఎవరైనా ఇస్తారా? భారతీయ రైల్వే ఇస్తుంది. అలా చేసినందుకు కోర్టు మొట్టికాయలు కూడా తింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, సహారన్ పూర్ నుంచి జావున్ పూర్ కు వెళ్లే హిమగిరి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించేందుకు పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ విష్ణుకాంత్ శుక్లా నిర్ణయించుకుని 2013, నవంబర్ 19న టికెట్ కొనుగోలు చేశాడు. ఆపై రైలు ఎక్కగా టీసీ వచ్చి టికెట్ చూపించాలని కోరితే చూపించాడు.

దాన్ని పరిశీలించి అవాక్కైన టీటీఈ, విష్ణును టికెట్ లేని ప్రయాణికుడని చెప్పి, రైలు నుంచి బలవంతంగా దించేశాడు. విషయం ఏమిటంటే, దానిపై నవంబర్ 19, 3013 అన్న తేదీ ఉండటమే. అందులో తన తప్పు లేదని బాధితుడు ఎంతగా మొత్తుకున్నా, టీటీఈ వినిపించుకోలేదు. ఇక తనకు జరిగిన అవమానానికి విష్ణుకాంత్, వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా, ఆయన పరువుకు భారతీయ రైల్వేలు నష్టం కలిగించాయని తీర్పిచ్చిన ఫోరం రూ. 13 వేల జరిమానా విధించింది.

  • Loading...

More Telugu News