Jagan: ఎవరి హయాంలో బీసీలకు న్యాయం జరిగిందో తేల్చుకుందాం..రా!: జగన్ కు అచ్చెన్నాయుడు సవాల్

  • నాలుగేళ్లలో బీసీలకు రూ.16 వేల కోట్లు ఖర్చు చేశాం 
  • పదేళ్ల కాంగ్రెస్ హయాంలో కేవలం రూ. 7 వేల కోట్లు ఖర్చు చేశారు
  • ఈ విషయమై చర్చకు నేను సిద్ధం

టీడీపీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని చెబుతున్న వైసీపీ అధినేత జగన్ కు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. ఎవరి హయాంలో బీసీలకు న్యాయం జరిగిందో తేల్చేందుకు బహిరంగ చర్చకు సిద్ధమా? అని జగన్ కు ఆయన సవాల్ విసిరారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో జరిగిన విదేశీ విద్యా దీవెన లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో బీసీల కోసం రూ.16 వేల కోట్లు ఖర్చు చేశామని, పదేళ్ల కాంగ్రెస్ హయాంలో కేవలం రూ. 7 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, టీడీపీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని జగన్ మాట్లాడటం బాధకరమని అన్నారు. ఈ విషయమై చర్చించేందుకు ఎక్కడైనా, ఎప్పుడైనా సరే చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. చంద్రబాబు పేదల పక్షపాతి అని కితాబిచ్చారు.

అనంతరం, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ, విదేశీ విద్యా దీవెన కింద ఎంపికైన వారికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయంతో పాటు వీసా, విమాన ఖర్చులు కూడా భరిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రాన్ని నాలెడ్జి హబ్ గా తీర్చిదిద్దాలన్నదే చంద్రబాబు సంకల్పమని, అందులో అన్ని వర్గాల వారు కలిసి రావాలని కోరారు.

  • Loading...

More Telugu News