Vijay Mallya: విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టు నుండి ఊరట.. ఆస్తుల సీజ్‌కు కోర్టు నిరాకరణ
- మాల్యా ఆస్తుల సీజ్‌కు కోర్టు నిరాకరణ
- న్యాయపోరాట ఖర్చులు మాత్రం చెల్లించాల్సిందేనని ఆదేశం
- భారత్‌కు పంపే విషయంలో వచ్చే నెలలో తుది విచారణ
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బకాయిలను రాబట్టుకునేందుకు బ్రిటన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన 13 బ్యాంక్‌ల కన్సార్టియంకు ఊరట లభించింది. న్యాయపోరాట ఖర్చుల కింద భారత బ్యాంకులకు 2 లక్షల పౌండ్లు (రూ.1.80 కోట్లు) చెల్లించాలని ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాను ఆదేశించింది. కేసును విచారించిన న్యాయమూర్తి ఆండ్రూ హెన్షా.. మాల్యా ఆస్తులను స్తంభింపజేసేందుకు నిరాకరించారు. అయితే, బ్యాంకులకు అవుతున్న ఖర్చును మాత్రం తప్పకుండా చెల్లించాల్సిందేనని ఆదేశించారు. మాల్యాను భారత్‌కు పంపాల్సిందిగా కోరుతూ భారత్ వేసిన పిటిషన్‌పై వచ్చే నెల వెస్ట్‌మినిస్టర్ కోర్టులో తుది వాదనలు జరగనున్నాయి.
స్టేట్ బ్యాంకు సహా దేశంలోని 13 బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.9 వేల కోట్లకుపైగా రుణాలను ఎగ్గొట్టిన విజయ్ మాల్యా 2016లో లండన్ పారిపోయాడు. అప్పటి నుంచి అతడిని భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.