Chandrababu: కొత్త రాష్ట్రానికి మేలు చేయమని అల్లాను వేడుకున్నా: సీఎం చంద్రబాబు

  • ఉర్దూ భాషలో రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన బాబు
  • ముస్లింల సంక్షేమానికి పాటుపడుతున్న ఘనత మాదే 
  • పన్నెండు లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చాం 

ఈరోజు రంజాన్ పండగ సందర్భంగా ముస్లింలకు ఉర్దూ భాషలో సీఎం చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కొత్త రాష్ట్రానికి మేలు చేయమని అల్లాను వేడుకున్నానని చెప్పారు.

ముస్లింల సంక్షేమానికి పాటుపడుతున్న ఘనత తమ ప్రభుత్వానిదని అన్నారు. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇమామ్ లకు, మౌజమ్ లకు వరుసగా ఐదువేలు, మూడువేల రూపాయల చొప్పున పారితోషికంగా ఇస్తున్నామని చెప్పారు. వాళ్లు రాత్రింబవళ్లు పనిచేస్తారు కనుక వాళ్ల జీవితాలకు కొంత వెసులుబాటు ఇవ్వాలని చెప్పే ఈ నిర్ణయం తీసుకున్నామని, వేరే రాష్ట్రాల్లో తామిస్తున్న విధంగా ఇవ్వడం లేదని అన్నారు. ఉర్దూను రెండో భాషగా చేయడం, హజ్ హౌస్ కట్టించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, పండగ సందర్భంగా పన్నెండు లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చామని చెప్పారు.

  • Loading...

More Telugu News