chaitu: ఓవర్సీస్ లో అక్కినేని హీరోకి పెరుగుతోన్న డిమాండ్

  • చందు మొండేటితో 'సవ్యసాచి'
  • మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు'
  • త్వరలో శివ నిర్వాణ తో సెట్స్ పైకి   
మాస్ హీరోగా పేరు తెచ్చుకోవడానికి నాగచైతన్య చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. దాంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథలను ఎంచుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నాడు. దాంతో ఆయన సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ వైపు నుంచి కూడా క్రేజ్ పెరుగుతూ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను ఆయన సినిమాలకి ఆదరణ .. డిమాండ్ పెరుగుతూ వస్తున్నాయి.

ఆయన తాజా చిత్రాలు కూడా ఇదే విషయాన్ని నిరూపించాయి. మారుతి దర్శకత్వంలో చైతూ 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు 3 కోట్ల 15 లక్షలకు అమ్ముడయ్యాయి. ఇక చందూ మొండేటితో చేస్తోన్న 'సవ్యసాచి' సినిమా ఓవర్సీస్ హక్కులు 3 కోట్ల 20 లక్షలకి అమ్ముడుపోయాయి. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో చైతూ సినిమా ఉండనుంది. ఇందులో సమంత హీరోయిన్ అనే సంగతి తెలిసిందే.   
chaitu
chandu mondeti
maruthi

More Telugu News