Rendu desai: రేణూ దేశాయ్ కవితపై నెటిజన్ల స్పందన!
- ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికాను.. అంటూ కొనసాగిన కవిత
- నిజమైన ప్రేమ గురించి ఎంత బాగా వర్ణించారు
- మిమ్మల్ని సిన్సియర్ గా ప్రేమించే వ్యక్తి దొరికారనుకుంటున్నా: నెజిజన్ల స్పందన
నటి రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటున్నారని, ఆమెకు సరైన భాగస్వామి దొరికినట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ తరుణంలో రేణూ దేశాయ్ చేసిన ఓ పోస్ట్ ఆసక్తి కరంగా ఉంది. రేణూ దేశాయ్ తాను చెప్పదలచుకున్న విషయాన్ని కవితాత్మక ధోరణిలో తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పొందుపరిచారు. ‘ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికాను... ఆ ప్రేమ కవిత్వంలో దొరుకుతుందని నేను అనుకుంటున్నా... నా చెయ్యి పట్టుకో, ఎప్పటికీ విడవకు..’ అంటూ ఆ కవిత సాగింది.
కాగా, ఈ కవితపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ‘నిజమైన ప్రేమ గురించి ఎంత బాగా వర్ణించారు.. మాటల్లేవు’,‘మీ భవిష్యత్ జీవితానికి ఆల్ ది బెస్ట్’, ‘మిమ్మల్ని సిన్సియర్ గా ప్రేమించే వ్యక్తి దొరికారని అనుకుంటున్నా’ అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.