america: కస్టమ్స్ డ్యూటీలు పెంపు.. అమెరికాకు షాకిచ్చిన భారత్
- ఇటీవలే కస్టమ్స్ డ్యూటీ పెంచిన అమెరికా
- అదే స్థాయిలో పెంచి జవాబిచ్చిన భారత్
- స్టీల్, అల్యూ మినియం, కాయధాన్యాలు, మోటారు సైకిళ్లపై పెంపు
- మొత్తం 30 రకాల ఉత్పత్తులకు సవరించిన రేట్లు
ఇటీవలే అమెరికా తమ దేశానికి భారత్ నుంచి దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం కస్టమ్స్ డ్యూటీలను విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అమెరికా విధించిన కస్టమ్స్ డ్యూటీలకు దీటుగా ఇండియా కూడా అదే స్థాయిలో విధించింది. స్టీల్, అల్యూ మినియం, కాయధాన్యాలు, మోటారు సైకిల్, బోరిక్ యాసిడ్వంటి ఉత్పత్తులపై భారీగా కస్టమ్స్ డ్యూటీలను వేసింది.
మొత్తం 30 రకాల ఉత్పత్తులకు సంబంధించి సవరించిన రేట్లను డబ్ల్యూటీఓకు సమర్పించింది. అన్ని ఉత్పత్తులపై కస్టమ్స్ కస్టమ్స్ డ్యూటీని 50 శాతం పెంచే ప్రతిపాదనను ఇచ్చింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 30 రకాల ఉత్పత్తులపై రాయితీలను వెనక్కి తీసుకోవాలని భారత్ నిర్ణయించింది. ఆయా ఉత్పత్తులపై ప్రతిపాదించిన అదనపు డ్యూటీలు 10 నుంచి 100 శాతం వరకు ఉన్నాయి. ఇవి ఈనెల 21 నుంచి అమల్లోకి వస్తాయి.