knee replacement: మోకీళ్ల మధ్యనున్న గ్యాప్ తగ్గిపోతే శస్త్రచికిత్స అవసరమే: నిపుణులు

  • లేదంటే కీళ్లు వంకరపోతాయి
  • ఆ తర్వాత ఇంప్లాంట్ అమర్చడం కష్టమవుతుంది
  • కండరాల బలం తగ్గిపోతుందని హెచ్చరిక

పెద్ద వయసు వచ్చిన తర్వాత మోకాళ్లు అరిగిపోయి నడక భారంగా మారిన వారి సంఖ్య నేడు తెగ పెరిగిపోతోంది. దీన్నే ఆస్టియో ఆర్థరైటిస్ గా చెబుతారు. మరి ఈ నేపథ్యంలో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలా? చేయించుకున్న తర్వాత మళ్లీ సాధారణంగా నడవడం సాధ్యమా? అన్న సందేహాలు వస్తుంటాయి. అయితే, నిపుణులు మాత్రం... మోకీళ్ల మధ్య నున్న గ్యాప్ తగ్గిపోతే శస్త్రచికిత్స అవసరమే అంటున్నారు.

‘‘మోకీలు జాయింట్లలో స్పేస్ తగ్గిపోయిందని ఎక్స్ రే చూపించినట్టయితే,  ఎముకల మధ్య ఒరిపిడి ఉన్నా, లేకపోయినా మోకీలు మార్పిడి శస్త్రచికిత్స అవసరం.  దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి’’ అని ఆర్థోస్కోపీ సర్జన్ డాక్టర్ ఎస్ఎస్ సోనీ తెలిపారు. దీన్ని ఆలస్యం చేస్తే ఎముకలు మరింత బలహీనంగా మారతాయని, వంకర పెరిగి, కండరాల బలం తగ్గిపోతుందని సోనీ వివరించారు. దాంతో కొత్త తరహా కీలును అక్కడ అమర్చలేమని, ఇంప్లాంట్ లూజ్ అయిపోతుందని తెలిపారు.

‘‘ఈ మేజర్ శస్త్రచికిత్సకు పేషెంట్లు మానసికంగా సంసిద్దమవ్వాలి. శస్త్రచికిత్స విధానాన్ని, ఇంప్లాంట్ డిజైన్ గురించి డాక్టర్ ను అడిగి తెలుసుకోవాలి. ఎన్నోరకాల కృత్రిమ కీళ్లు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ భిన్నమైన పనితీరును చూపిస్తాయి. అలాగే, వాటి మన్నిక, ధరలు వేర్వేరుగా ఉంటాయి’’ అని సోనీ వివరించారు.

  • Loading...

More Telugu News