Ramcharan: మీరే నా హీరో, నాకు స్ఫూర్తి.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా: రామ్ చరణ్
- ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ శుభాకాంక్షలు
- తండ్రితో కలసి ఉన్న ఫొటోను పంచుకున్న చరణ్
- అందరినీ ఆకట్టుకుంటున్న ట్వీట్
ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి చిరంజీవికి యంగ్ హీరో రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. 'నా మార్గ నిర్దేశకులు, నా హీరో, నాకు స్ఫూర్తి అన్నీ మీరే. హ్యాపీ ఫాదర్స్ డే' అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ఇరువురూ కలసి ఉన్న ఫొటోను అప్ లోడ్ చేశాడు. ప్రతి విషయంలో కూడా రామ్ చరణ్ తన తండ్రి సలహాలు, సూచనలు తీసుకుంటారనే విషయం తెలిసిందే. తండ్రి మాటను జవదాటని కొడుకుగా రామ్ చరణ్ కు మంచి పేరు ఉంది.