Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదు: స్పష్టం చేసిన బీఎస్పీ

  • మధ్యప్రదేశ్ లో అన్ని స్థానాలకూ పోటీ
  • కాంగ్రెస్ తో ఎలాంటి చర్చలూ లేవు
  • బీఎస్పీ నేత నర్మదా ప్రసాద్ అహిర్వార్

త్వరలో జరిగే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ కలసికట్టుగా కృషి చేస్తాయని వస్తున్న వార్తలు అవాస్తవమని తేలిపోయింది. 230 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని సీట్లకూ ఒంటరిగానే పోటీ చేస్తుందని, కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని బహుజన్ సమాజ్ పార్టీ తేల్చిచెప్పింది. ఆ పార్టీ సీనియర్ నేత నర్మదా ప్రసాద్ అహిర్వార్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కాగా, రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో సమస్యలు ఉన్నాయని, కాంగ్రెస్ కు పట్టున్న గ్వాలియర్ - చంబల్ రీజియన్ లో కాలుమోపాలని మాయావతి భావిస్తుండటమే సమస్యను పెంచుతోందని సమాచారం.

ఇరు పార్టీల మధ్య చర్చలు సాగుతున్నాయని తెలుస్తుండగా, ఆ విషయాన్నీ అహిర్వార్ తోసిపుచ్చారు. తాము పొత్తు దిశగా ఎవరితోనూ చర్చించడం లేదని, జాతీయ స్థాయిలోనూ చర్చలు సాగడం లేదని అన్నారు. పొత్తులపై తామెన్నడూ మాట్లాడలేదని, కాంగ్రెస్ నేతలే పదే పదే పొత్తు గురించి ప్రస్తావిస్తున్నారని విమర్శించారు. అన్ని సీట్లలో తాము పోటీ చేయనున్నామని అన్నారు. మధ్యప్రదేశ్ లో ఈ సంవత్సరం ఆఖర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో బీజేపీ 165 స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్ 58, బీఎస్పీ 4 స్థానాలకు పరిమితమైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News