petrol: నాలుగు రోజుల తర్వాత మరోసారి తగ్గిన పెట్రోల్ ధరలు!

  • హైదరాబాద్ లో పెట్రోల్ లీటర్ కు 9 పైసలు తగ్గుదల
  • వైజాగ్ లో 8 పైసలు తగ్గుదల
  • డీజిల్ ధరలు కొన్ని ప్రాంతాల్లోనే తగ్గుదల

నాలుగు రోజుల విరామం అనంతరం ఈ రోజు పెట్రోల్ ధరను చమురు మార్కెటింగ్ కంపెనీలు స్వల్పంగా తగ్గించాయి. డీజిల్ ధరలు కొన్ని ప్రాంతాల్లోనే తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో పెట్రోల్ లీటర్ కు9 పైసలు తగ్గి రూ.80.79గా ఉంది. డీజిల్ ధరలో ఏ మాత్రం మార్పు లేకుండా రూ.73.67గానే ఉంది. వరంగల్ లో పెట్రోల్ ధర 8 పైసలు తగ్గి రూ.80.55గా ఉంది. డీజిల్ ధర రూ.73.35. వైజాగ్ లో పెట్రోల్ ధర 8 పైసలు తగ్గి లీటర్ కు రూ.81.66గా ఉంది. డీజిల్ ధర రూ.74.17. గుంటూరులో పెట్రోల్ 8 పైసలు తగ్గి రూ.82.52గా ఉంది. డీజిల్ ధర రూ.75.02. చిత్తూరులో పెట్రోల్ ధర లీటర్ కు 8పైసలు తగ్గి రూ.82.92గా ఉంది. డీజిల్ ధర రూ.75.35.

  • Loading...

More Telugu News