aadhar card: మొబైల్ ఫోన్లు, ఆధార్ కార్డులపై కీలక గణాంకాలను విడుదల చేసిన మంత్రి రవిశంకర్ ప్రసాద్
- జూన్ 16 నాటికి 121.46 కోట్ల ఆధార్ కార్డుల జారీ
- 2017-18లో దేశంలో 22.5 కోట్ల మొబైల్స్ తయారీ
- వీటి విలువ రూ.1.32 లక్షల కోట్లు
ఈ ఏడాది జూన్ 16 నాటికి దేశంలో మొత్తం 121.46 కోట్ల ఆధార్ కార్డులను జారీ చేసినట్టు ఐటీ, న్యాయ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. మొబైల్ ఫోన్ల తయారీ దేశంలో గణనీయంగా పెరిగినట్టు చెప్పారు. 2017-18 నాటికి మొబైల్ ఫోన్లు, వాటి ఉపకరణాలను తయారు చేసే 120 యూనిట్లు దేశంలో ఏర్పాటైనట్టు వెల్లడించారు. ఇదే కాలంలో ఏటా 22.5 కోట్ల హ్యాండ్ సెట్లు తయారయ్యాయని, వీటి విలువ రూ.1.32 లక్షల కోట్లు ఉంటుందన్నారు. ఇక డిజిటల్ రూపంలో డాక్యుమెంట్లను ఉచితంగా ఆన్ లైన్ లో పొందుపరుచుకునే డిజిలాకర్ వినియోగించే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగినట్టు మంత్రి చెప్పారు. 2017-18 నాటికి 1.17 కోట్ల మంది డిజిలాకర్ ను వినియోగిస్తున్నారని, 1.52 కోట్ల డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసుకున్నారని వివరించారు.