Jagan: అలా చంద్రబాబు బెదిరించడం గర్హనీయం... నాయీ బ్రాహ్మణుల సమస్యలపై జగన్‌ ట్వీట్‌

  • తమ గోడు చెప్పుకోవడానికి నాయీ బ్రాహ్మణులు వచ్చారు
  • దేవుడిచ్చిన వరంలా రూ.25 చొప్పున ఇస్తామన్నారు
  • చంద్రబాబు హావభావాలు బాగోలేవు 
  • నియంత స్వభావాలు కళ్లకు కట్టినట్లు కనపడ్డాయి

ఆంధ్రప్రదేశ్‌లో నాయీ బ్రాహ్మణులు చేస్తోన్న డిమాండ్‌ల పట్ల సర్కారు తీరుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి స్పందించారు. మనం నాగరికంగా ఉండాలంటే నాయీ బ్రాహ్మణుల సేవలు పొందడం తప్పనిసరంటూ ట్వీట్‌ చేశారు. నాయీ బ్రాహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన తీరును చూసి తాను విస్తుపోయానని చెప్పారు.

తమ గోడు చెప్పుకోవడానికి వచ్చిన వారిని బెదిరించడం గర్హనీయమని, పైగా తలనీలాలు తీస్తున్నందుకు రూ.25లు చొప్పున ఇస్తానంటూ, ఏదో దేవుడిచ్చిన వరం మాదిరిగా చంద్రబాబు హావభావాలు ఉన్నాయని జగన్‌ పేర్కొన్నారు. ఆయనలోని అహంకార, నియంత స్వభావాలను కళ్లకు కట్టినట్లు చూపించాయని విమర్శించారు.

  • Loading...

More Telugu News