kalva: ముగిసిన భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ మంత్రివర్గం
- కమ్యూనికేషన్ టవర్ ఇన్ఫ్రా కోసం నిర్ణయం
- జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటుకు ఆమోదం
- అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం
- ఒంగోలు డెయిరీకి రుణం ఇచ్చేందుకు ఆమోదం
అమరావతిలోని ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతోన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వివరించారు. కమ్యూనికేషన్ టవర్ ఇన్ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుందన్నారు.
ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, అలాగే, రూ.500 కోట్లతో ప్రైవేటు స్థలాలు కూడా కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించాలని భావిస్తున్నామని కాల్వ శ్రీనివాసులు చెప్పారు. తిరుపతిలో ఎలక్ట్రానిక్ మ్యాను ఫాక్చరింగ్ క్లస్టర్-2 అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నామని, ఒంగోలు డెయిరీకి రూ. 35 కోట్ల రుణం ఇచ్చేందుకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని చెప్పారు. కమ్యూనికేషన్ టవర్ ఇన్ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని అన్నారు.