BJP: పీడీపీతో బీజేపీ తెగదెంపులపై ప్రముఖుల స్పందన

  • జమ్ముకశ్మీర్‌ని నాశనం చేశారు
  • మూడున్నరేళ్లు నష్టపర్చారు
  • ఇప్పుడు పీడీపీతో బంధం తెంచుకున్నారు
  • జవాన్లు, కశ్మీర్‌ పౌరుల మరణాలు పెరిగాయి

జమ్ముకశ్మీర్‌లో బీజేపీ-పీడీపీ బంధం తెగిపోవడంపై పట్ల పలు పార్టీల నేతలు స్పందించారు. బీజేపీ చేస్తోన్న రాజకీయాలపై విమర్శలు గుప్పించారు.

పీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ జమ్ముకశ్మీర్‌ని నాశనం చేసిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ అన్నారు. ఈ మూడున్నరేళ్లు నష్టపర్చి ఇప్పుడు పీడీపీతో బంధం తెంచుకుందని విమర్శించారు. ఈ మూడున్నరేళ్లలో ఎంతోమంది జవాన్లు, కశ్మీర్‌ పౌరులు మరణించారని అన్నారు. పీడీపీతో కలిసి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ప్రశ్నే లేదని చెప్పారు.  

బీజేపీ-పీడీపీలకు అసలు పోలికే లేదని, అటువంటి పార్టీలు అధికారం కోసం కూటమిగా ఏర్పాటయ్యాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు.
 
మూడేళ్ల పాటు కశ్మీర్‌లో అశాంతి నెలకొందని, పౌరులకు, జవాన్లకు నష్టం కలిగిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. ప్రజల సంక్షేమాన్ని మరచి రాజకీయాలు చేశారు కాబట్టే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు.  

  • Loading...

More Telugu News