.com: ఇంటర్నెట్ ప్రపంచంలో 33.38 కోట్లకు చేరిన ‘డొమైన్’లు

  • డాట్ కామ్, డాట్ నెట్ విభాగంలో మొత్తం డొమైన్ లు 14.8 కోట్లు
  • ఇందులో డాట్ కామ్ పేర్ల సంఖ్య 13.39 కోట్లు
  • వెరీసైన్ సంస్థ వెల్లడి

ఇంటర్నెట్ వేదికపై డొమైన్ ల సంఖ్య 2018 మార్చి నాటికి 33.38 కోట్లకు పెరిగాయని ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థ వెరీసైన్ తెలిపింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసిక కాలంలో కొత్తగా 14 లక్షల డొమైన్ పేర్లు నమోదైనట్టు వెల్లడించింది. డొమైన్ నేమ్ అన్నది వెబ్ సైట్ పేరు. డాట్ కామ్, డాట్ నెట్ పేర్లు మొత్తం 14.8 కోట్లు ఉన్నాయని వెరిసైన్ సంస్థ విడుదల చేసిన నివేదిక తెలియజేస్తోంది. వీటిలో 13.39 కోట్లు డాట్ కామ్ విభాగంలోనివే. మిగిలినవి డాట్ నెట్. ఏటా 46 లక్షల మేర డాట్ కామ్, డాట్ నెట్ చిరునామాతో పేర్లు నమోదవుతున్నాయి.

  • Loading...

More Telugu News