nokia x6: నోకియా ఎక్స్6 భారత మార్కెట్లోకి రావడం ఖాయం!
- గత నెలలోనే చైనా మార్కెట్లోకి విడుదల
- నోకియా ఇండియా వెబ్ సైట్లో ఎక్స్6 సపోర్ట్ పేజీ
- త్వరలో విడుదల చేసే అవకాశం
నోకియా ఎక్స్ 6 స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి రావడం ఖాయమైంది. ఇందుకు సంకేతంగా నోకియా ఇండియా వెబ్ సైట్ లో సపోర్ట్ పేజీ దర్శనమిచ్చింది. యూజర్ మాన్యువల్ ను కూడా అందుబాటులో ఉంచింది. అయితే, భారత మార్కెట్లో ఎప్పుడు విడుదల చేయనున్నదీ కంపెనీ నుంచి ప్రకటన లేదు. నోకియా బ్రాండ్ హెచ్ ఎండీ గ్లోబల్ సొంతమనే విషయం తెలిసిందే. నోకియా ఎక్స్6 ఫోన్ ను గత నెలలోనే చైనాలో విడుదల చేయడం జరిగింది.
ఇందులో 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ మోడల్ ధరను 1,299 యువాన్లుగా నిర్ణయించగా, మన కరెన్సీలో రూ.13,900. అలాగే, 4జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ ధర రూ.16,000. 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ధర మన కరెన్సీలో రూ.18,100. ఈ ఫోన్ లుక్స్ ఆకర్షణీయంగా ఉండడం, ఫీచర్లు కూడా బాగుండడంతో ఎప్పుడు వస్తుందా అని దేశీయ యూజర్లు వేచి చూస్తున్నారు. ఈ ఫోన్లో 5.8 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ 19:9 యాస్పెక్ట్ రేషియో స్క్రీన్, స్నాప్ డ్రాగన్ 636 ఆక్టాకోర్ ప్రాసెసర్, వెనుక భాగంలో 16+5 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు, ముందు భాగంలో 16ఎంపీ కెమెరా, 3,060 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఓరియో 8.1 వెర్షన్ పై పనిచేస్తుంది.