irctc: బౌద్ధ క్షేత్రాల సందర్శనకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజ్!

  • బౌద్ధ క్షేత్రాల సందర్శనకు ‘బుద్ధిస్ట్ సర్క్యూట్ స్పెషల్ ట్రైన్’
  • ఈ స్పెషల్ ప్యాకేజ్ రైలులో ఎనిమిది రోజుల పాటు పర్యటన
  • అక్టోబరు 6వ తేదీ లోగా ఈ ప్యాకేజ్ ను పొందే ప్రయాణికులకు పది శాతం రాయితీ

బౌద్ధ క్షేత్రాలను సందర్శించదలచుకున్న ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక ప్యాకేజ్ ను ప్రకటించింది. ‘బుద్ధిస్ట్ సర్క్యూట్ స్పెషల్ ట్రైన్’ పేరిట అందుబాటులోకి తెచ్చిన ఈ ప్యాకేజ్ వివరాలు. ఈ స్పెషల్ ప్యాకేజ్ రైలులో ఎనిమిది రోజుల పాటు పర్యటన ఉంటుంది. ఈ యాత్రలో బుద్ధ గయ, నలంద, రాజ్ గిరి, వారణాసి, సమాత్, కుషినగర్, లుంబినీ, శ్రవతీ, ఆగ్రా ప్రాంతాలను సందర్శిస్తారు. 

ఢిల్లీ లోని  సప్ధర్ జంగ్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరే ఈ రైలులో కేవలం ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏసీ బోగీలు మాత్రమే ఉంటాయి. అన్ని రకాల సదుపాయాలు లభిస్తాయి. అక్టోబరు 6వ తేదీ లోగా ఈ ప్యాకేజ్ ను పొందే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ పది శాతం రాయితీ కూడా అందజేస్తోంది. ఈ ప్రత్యేక రైలు 2020 మార్చి 28 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.

- ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ లో ప్రయాణించేందుకు రూ.78,713 చెల్లించాలి.  

- ఏసీ సెకండ్ క్లాస్ లో ప్రయాణించేందుకు రూ.64,402 చెల్లించాలి

-ప్యాకేజ్ లో భాగంగా మీల్స్, స్నాక్స్ మొదలైన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. ఆయా నగరాల్లో ప్రయాణికులు ఉండేందుకు హోటల్ సదుపాయం కూడా కల్పిస్తారు.

 

  • Loading...

More Telugu News