nakka anand babu: ఉన్నత వర్గాలకు దీటుగా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తాం: మంత్రి ఆనందబాబు
- షెడ్యూల్డ్ కులాల, తెగల కాంపొనెంట్లను నోడల్ ఏజెన్సీ ఆమోదించింది
- షెడ్యూల్డ్ కులాల కాంపోనెంట్ కింద రూ.11,228.11 కోట్లు
- గిరిజన తెగల కాంపొనెంట్ కింద రూ.4,176.60 కోట్లు
ఉన్నత వర్గాలకు దీటుగా ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన సబ్ ప్లాన్ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించిన ప్రభుత్వం కూడా తమదేనని, ఇది ఒక చరిత్ర అని ప్రశంసించారు. 2018-19 సంవత్సరానికి గానూ షెడ్యూల్డ్ కులాల కాంపోనెంట్ కింద రూ.11,228.11 కోట్లు, గిరిజన తెగల కాంపొనెంట్ కింద రూ.4,176.60 కోట్లు కేటాయిస్తూ నోడల్ ఏజెన్సీ ఆమోదించిందని, ఈ నిధులను సాంఘిక సంక్షేమ శాఖలో 41 డిపార్టుమెంట్లకు, గిరిజన సంక్షేమ శాఖలో 44 డిపార్టుమెంట్లకు వినియోగించనున్నట్లు వెల్లడించారు.ఎస్సీ, ఎస్టీల సంక్షేమ కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ప్రభుత్వం తమదేనని, గత ఏడాది ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను రికార్డు స్థాయిలో ఖర్చు చేశామని, ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్లో 97.52 శాతం, ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్లో 95.11 శాతం మేర వెచ్చించామని తెలిపారు. నిధుల వినియోగంలో ప్రతి నెలా నోడల్ సమావేశాలు నిర్వహించామని, సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన 5 పర్యాయాలు మానిటరింగ్ సమావేశాలు కూడా చేపట్టామని, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఎస్సీ, ఎస్టీలను ఉన్నత వర్గాలకు దీటుగా ఎదిగేలా ఎల్లవేళలా కృషి చేస్తున్నామని అన్నారు.
గత ఏడాది కంటే ఈ ఏడాది ఎస్సీ కాంపొనెంట్ కింద రూ.14.02 శాతం, ఎస్టీ కాంపొనెంట్ కింద 18.36 శాతం మేర నిధులు పెంచామని, ఎస్సీ కాలనీలు, గిరిజన గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. నాలుగేళ్ల కిందట 1800 గిరిజన హ్యాబిటేషన్లలో రోడ్డు కనెక్టవిటీ నిర్మిస్తే, తమ ప్రభుత్వం వచ్చిన ఈ నాలుగేళ్ల కాలంలో 3 వేల హ్యాబిటేషన్ గ్రామాలకు రోడ్డు కనెక్టవిటీ వేశామని ఆనందబాబు తెలిపారు. ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా ఎస్సీలకు రూ.1.50 లక్షలతో పాటు అదనంగా రూ.25 వేలు ఇవ్వనున్నామని, కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు రూ.50 వేలు, మైదాన ప్రాంతాల వారికి రూ.25 వేలు అదనంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఎస్సీ కాంపొనెంట్ కింద కేటాయించిన నిధులు
- 2018-19 కింద ఎస్సీల సంక్షేమానికి రూ.11,228.22 కోట్లు కేటాయింపు
- రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలు నివాసం ఉండే ప్రాంతాల్లో 3,220 రోడ్ల పనులకు రూ.55.73 కోట్లు
- 857 పీసీ 3 కేటగిరి ఎస్సీ ఆవాసాల్లో ఉండే చోట గ్రామీణ నీరుపారుదలకు రూ.241.86 కోట్లు
- 70 మంది కంటే ఎక్కువగా ఎస్సీ విద్యార్థులు ఉండే 16 ప్రభుత్వ ఐటీఐల్లో వసతి గృహాల నిర్మాణం
- 9 మున్సిపాల్టీలు.. కర్నూలు, కాకినాడ, నెల్లూరు, తెనాలి, కావలి, జగ్గయ్యపేట, అద్దంకి, విశాఖపట్నం, వినుకొండల్లో వివిధ అభివృద్ధి పనులకు రూ.194.34 కోట్లు కేటాయింపు
- సాంఘిక సంక్షేమ శాఖకు రూ.2,675.08 కోట్లు
- గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.1,715.97 కోట్లు
- సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు రూ.1,056.06 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు రూ.853.30 కోట్లు పురపాలక, నగర అభివృద్ధి శాఖకు రూ.673.56 కోట్లు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి -నోడల్ ఏజెన్సీ ఆమోదం తెలిపిందని నక్కా ఆనందబాబు తెలిపారు. ఎస్టీ కాంపొనెంట్ కింద కేటాయించిన నిధులు
- 2018-19 కింద ఎస్సీల సంక్షేమం కింద 44 డిపార్టుమెంట్లకు రూ.4,176.60 కోట్లు కేటాయింపు
- గత ఏడాది కంటే 18.36 శాతం అధికం
- గిరిజన సంక్షేమ శాఖకు రూ.1,301.30 కోట్లు
- గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.669.25 కోట్లు
- గృహ నిర్మాణ శాఖకు రూ.294.02 కోట్లు
- స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు 212.17 కోట్లు
- గ్రామీణ నీటి సరఫరా శాఖకు రూ.211.80 కోట్లు
- పాఠశాల విద్యా శాఖకు రూ.207.33 కోట్లు
- రోడ్లు, భవనాల శాఖకు రూ.150 కోట్లు
- వ్యవసాయ శాఖకు రూ.134.02 కోట్లు
- యువజన సేవల శాఖకు రూ.120 కోట్లు
- పంచాయతీరాజ్ శాఖకు రూ.118.90 కోట్లు
- వైద్య, ఆరోగ్య శాఖకు రూ.115.49 కోట్లు కేటాయిస్తూ నోడల్ ఏజెన్సీ ఆమోదించినట్లు ఆనందబాబు తెలిపారు.
నోడల్ ఏజెన్సీ ఆమోదం తెలిపిన వాటిలో ముఖ్యమైనవి
- 1,398 గిరిజన గ్రామాలకు 2,800 కిలో మీటర్లలో సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.276.92 కోట్లు కేటాయింపు
- రూ.1.49 కోట్లతో గిరిజన కమ్యూనిటీ హాలుల నిర్మాణం
- వంశధార ప్రధాన కాలువపై రూ.97.66 కోట్లతో ఎత్తుపోతల పథకం
- తూర్పు గోదావరి జిల్లాలోని 9 విలీన మండలాల్లో ఉన్న 51 ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు రూ.171.90 కోట్లు
- 1,210 గిరిజన ఆవాసాలకు రూ.154.391 కోట్లతో తాగునీటి కల్పన
- గిరిజన రెసిడెన్షియల్ కళాశాలల్లో రూ.144 కోట్లతో అదనపు తరగతుల నిర్మాణం
- 676 మండలాల్లో 36,976 అసంపూర్తి గృహాల పూర్తికి రూ.142.88 కోట్లు
- రూ.140 కోట్లతో రాష్ట్రంలో 6 ఐటీడీఏలు, 8 జిల్లా కేంద్రాల్లో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియాలతో పాటు అరకులో క్రీడా పాఠశాల నిర్మాణం
- రూ.11.36 కోట్లతో రంపచోడవరంలో రెసిడెన్షియల్ ఐటీఐ నిర్మాణం