true caller: ట్రూ కాలర్ లో పాత ఫీచర్ కొత్తగా... మీ ప్రొఫైల్ చూసిన వారి సమాచారం
- గత ఫీచర్ ను తిరిగి ప్రవేశపెట్టిన ట్రూ కాలర్
- ప్రొఫైల్ ను వేరొకరు క్లిక్ చేస్తే, ప్రొఫైల్ యూజర్లకు నోటిఫికేషన్
- కేవలం సెర్చ్ చేస్తే తెలియదన్న సంస్థ
ట్రూ కాలర్ గతంలో ఉన్న ఫీచర్ ను మళ్లీ తిరిగి ప్రవేశపెట్టింది. ఎవరైనా ట్రూ కాలర్ యూజర్ మీ ప్రొఫైల్ ను చూస్తే ఆ సమాచారాన్ని మీరు తెలుసుకోవడమే ఈ సదుపాయం. ఎవరు తమ ప్రొఫైల్ ను చూశారు, ఎవరి నుంచి కాల్స్ రావచ్చన్నది యూజర్లు అంచనా వేసుకునేందుకే ఈ ఫీచర్ తీసుకొచ్చినట్టు ట్రూ కాలర్ ప్రకటించింది. ట్రూ కాలర్ యూజర్ ఎవరైనా మరొకరి ప్రొఫైల్ చూస్తే ఆ సమాచారం సంబంధిత ప్రో యూజర్లకు నోటిఫికేషన్ రూపంలో ట్రూ కాలర్ తెలియజేస్తుంది. అయితే, యూజర్ ప్రొఫైల్ చూస్తేనే ఈ సమాచారం తెలుస్తుంది. అలా కాకుండా కేవలం సెర్చ్ చేసి వదిలేస్తే తెలియదని కంపెనీ తెలిపింది.