marriage: ప్లాస్టిక్‌ కప్పలకు పెళ్లి చేసిన వైనం!

  • ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఘటన
  • వర్షం కురవాలని పెళ్లి
  • పురాతన కాలం నుంచి ఉన్న నమ్మకమన్న నిర్వాహకులు

వర్షాలు పడాలని కొందరు దేవుళ్లకి మొక్కడం, హోమాలు చేయడం వంటివి మనం చూస్తూనే ఉంటాం. కానీ, ఓ గ్రామస్తులు వాన కోసం ప్లాస్టిక్‌తో చేసిన కప్పలకు పెళ్లి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చోటు చేసుకుంది. ఈ పెళ్లి గురించి అక్కడి వారు మాట్లాడుతూ... తమ నగరంలో వర్షం కురవాలని తాము కోరుకుంటున్నామని, కప్పలకు పెళ్లి చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడన్నది పురాతన కాలం నుంచి ఉన్న నమ్మకమని అన్నారు. అందుకే తాము ఈ పెళ్లి వేడుక నిర్వహిస్తున్నామని, వర్షాలు కురిపించాలని ఇంద్రుడిని కోరామని అన్నారు.      

  • Loading...

More Telugu News