Jarkhand: జార్ఖండ్ గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరు అరెస్ట్... విచారణలో భయంకర నిజాల వెల్లడి!
- మహిళలను తీవ్రంగా హింసించిన నిందితులు
- బెత్తాలతో బాదుతూ దుర్మార్గం
- నోట్లో మూత్రం పోస్తూ పైశాచికానందం
- వెల్లడించిన పోలీసు అధికారులు
మనుషుల అక్రమ రవాణా కూడదని ఓ వీధినాటకాన్ని వేస్తున్న ఐదుగురు మహిళలను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించగా, వారు కొన్ని భయంకర నిజాలను వెల్లడించారు. సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఆర్కే మల్లిక్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఘటనలో మొత్తం ఆరుగురు పాల్గొన్నారు. వీరు కేవలం రేప్ కు పాల్పడి మహిళలను వదిలివేయకుండా వారిని తీవ్రంగా హింసించారు.
ఓ స్కూల్ లో ప్రదర్శన ఇస్తున్న వీరితో ఉన్న పురుషులను కొట్టి, ఐదుగురు మహిళలను బలవంతంగా కార్లలో ఎక్కించుకున్న యువకులు, రాంచీకి 100 కిలోమీటర్ల దూరంలోని కుంతీ జిల్లా అడవుల్లోకి తీసుకెళ్లారు. అక్కడ వారిపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా, అనంతరం తుపాకిని చూపించి బెదిరిస్తూ, బెత్తాలతో కొడుతూ పైశాచిక ఆనందాన్ని పొందారు. దాదాపు నాలుగు గంటల పాటు వారికి నరకాన్ని చూపించడమే కాకుండా, వారి నోట్లో మూత్రం పోశారు. తమ క్రూరత్వాన్ని వీడియో తీశారు. ఈ ఐదుగురు మహిళలు 'ఆశా కిరణ్' అనే ఎన్జీవో తరఫున పనిచేస్తున్నారని, గ్యాంగ్ రేప్ కు పాల్పడిన మిగతా నిందితులను సాధ్యమైనంత త్వరలో అరెస్ట్ చేస్తామని మల్లిక్ తెలిపారు.