Vijayawada: విజయవాడ మెట్రో ఆలస్యానికి కారణం కేంద్రమే: మంత్రి నారాయణ
- కేంద్రం వైఖరి కారణంగా నాలుగేళ్లు ఆలస్యమైంది
- విజయవాడ - అమరావతి మెట్రోకు డీపీఆర్ సిద్ధం చేస్తున్నాం
- గన్నవరం ఎయిర్ పోర్టు, అమరావతిని కలిపేలా ప్రణాళిక
విజయవాడ మెట్రో ప్రాజెక్టు ఆలస్యానికి కారణం కేంద్రం వైఖరేనని మంత్రి నారాయణ మండిపడ్డారు. ఏపీ సచివాలయంలో నారాయణను మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి, జర్మన్ ఫైనాన్స్ ఏజెన్సీ కేఎఫ్ డబ్ల్యూ, సిస్టా కంపెనీ ప్రతినిధులు ఈరోజు కలిశారు. అనంతరం, మీడియాతో నారాయణ మాట్లాడుతూ, కేంద్రం వైఖరి కారణంగానే మెట్రో ప్రాజెక్టు నాలుగేళ్లు ఆలస్యమైందని ఆరోపించారు. విభజన హామీల్లో భాగంగా విజయవాడ మెట్రో ప్రాజెక్టును అమలు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ - అమరావతి మెట్రోకు డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని, గన్నవరం ఎయిర్ పోర్టు, అమరావతిని కలిపేలా మెట్రో ప్రణాళికను రూపొందించనున్నట్టు చెప్పారు.