Reliance jio: రిలయన్స్ ఫీచర్ ఫోన్లో త్వరలో యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్
- జియో ఫీచర్ ఫోన్లలో కేఏఐ ఓఎస్
- వీటి కోసం ప్రత్యేకంగా గూగుల్ యాప్స్ అభివృద్ధి
- గూగుల్ నుంచి నిధుల సహకారం
రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ యూజర్లకు త్వరలోనే గూగుల్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, గూగుల్ సెర్చ్ సేవలను పొందే అవకాశం రానుంది. ఈ ఫోన్లు కేఏఐ ఓఎస్ పై పనిచేస్తున్నాయి. అమెరికాకు చెందిన కేఏఐఓఎస్ టెక్నాలజీస్ ఈ ఫోన్లకు ఓఎస్ సమకూర్చింది. గూగుల్ సహకారంతో కేఏఐ ఓఎస్ కు సపోర్ట్ చేసే విధంగా యాప్స్ ను రూపొందించారు. ఇంటర్నెట్ ను మరింత మందికి చేరువ చేయాలన్న సంకల్పంలో భాగంగా గూగుల్ 22 మిలియన్ డాలర్ల నిధులను కూడా కేఏఐ ఓఎస్ టెక్నాలజీస్ కు అందించింది. ఈ నిధులతో కేఏఐఓఎస్ ఆధారిత స్మార్ట్ ఫీచర్ ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టేందుకు వీలవుతుందని ఆ సంస్థ సీఈవో సెబాస్టియన్ కోడెవిల్లే తెలిపారు.