swiss bank: స్విస్ బ్యాంకుల్లో ఉన్నదంతా బ్లాక్ మనీనే అని ఎలా చెబుతాం?: కేంద్ర మంత్రి గోయల్

  • అక్రమ డిపాజిట్లు చేసిన వారిపై చర్యలు తప్పవు
  • స్విస్ బ్యాంకుల ఖాతాల వివరాల సేకరణ ప్రారంభం కానుంది
  • ఏడాది చివరి కల్లా తుది సమచారం అందుతుంది

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు మళ్లీ ఊపందుకున్నాయనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖకు ఇన్ ఛార్జ్ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ, ఈ డిపాజిట్లన్నీ నల్లధనమే అని ఎలా భావిస్తామని అన్నారు.

అయితే, అక్రమ డిపాజిట్లు చేస్తున్న వారిపై మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్విట్జర్లాండ్ తో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఆ దేశం నుంచి బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించే పనిని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా తుది సమాచారం ప్రభుత్వానికి అందుతుందని అన్నారు. గత మూడేళ్లలో ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల వల్ల స్విస్ బ్యాంక్ డిపాజిట్లు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. 

  • Loading...

More Telugu News