Telangana Jana Samithi: ఉపాధ్యాయుల బదిలీలకు.. అధికార పార్టీ నాయకులు రూ.3 లక్షల చొప్పున వసూలు చేశారు: ప్రొ.కోదండరామ్‌ ఆరోపణలు

  • తెలంగాణలో ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు
  • బదిలీల అక్రమాల్లో కొందరు మంత్రులు 
  • వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో గందరగోళం 
  • రేషన్‌ డీలర్ల న్యాయమైన డిమాండ్లకు టీజేఎస్‌ మద్దతు

తెలంగాణలో ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకు అధికార పార్టీ నాయకులు ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు చేశారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... బదిలీల అక్రమాల్లో కొందరు మంత్రులు ఉన్నారని తెలిసిందని, అలాగే, వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ గందరగోళంగా ఉందని చెప్పారు.

అలాగే, రేషన్‌ డీలర్ల సమస్యలను సర్కారు పరిష్కరించాలని, రేషన్‌ డీలర్ల న్యాయమైన డిమాండ్లకు తెలంగాణ జనసమితి మద్దతిస్తోందని తెలిపారు. మరోవైపు 40 శాతంకు పైగా రైతులకు రైతు బంధు పథకంతో లబ్ది చేకూరలేదని, చాలా మంది రైతులకు కొత్త పాస్‌ పుస్తకాలు రాలేదని, వచ్చినవి కూడా తప్పుల తడకగా ఉన్నాయని చెప్పారు.   

  • Loading...

More Telugu News