Thottathil B. Radhakrishnan: హైదరాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా తొట్టత్తిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్
- ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి
- నియమకపు ఉత్తర్వులు విడుదల
- త్వరలోనే జస్టిస్ రంగనాథన్ కు పదోన్నతి
హైదరాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, తొట్టత్తిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. ఆయన నియామకపు ఉత్తర్వులపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేశారు. ప్రస్తుతం చత్తీస్ గఢ్ సీజేగా ఉన్న జస్టిస్ రాధాకృష్ణన్ ను తెలుగు రాష్ట్రాల హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు వెలువరించింది.
కేరళలోని కొల్లాంలో 1959, ఏప్రిల్ 29న జన్మించిన రాధాకృష్ణన్, కర్ణాటకలోని కేజీఎఫ్ లా కాలేజీలో విద్యను అభ్యసించారు. 2004 అక్టోబర్ లో కేరళ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇక జూలై 2016 నుంచి, హైదరాబాద్ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ రమేష్ రంగనాథన్, త్వరలో మరో రాష్ట్ర హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా వెళతారని సమాచారం.