AMMA: మలయాళ సినీ అసోసియేషన్ ను ఇక నమ్మే ప్రసక్తే లేదు: సీనియర్ నటీమణులు

  • అసోసియేషన్ లో తిరిగి చేరబోమన్న 15 మంది సీనియర్ నటీమణులు
  • 'అమ్మ'పై నమ్మకం పోయిందంటూ ప్రకటన
  • అన్నీ ఏకపక్ష నిర్ణయాలే తీసుకుంటున్నారంటూ ఆగ్రహం

నటీమణులపై లైంగిక వేధింపుల నేపథ్యంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)లో చెలరేగిన చిచ్చు ఇప్పట్లో ఆరిపోయే సూచనలు కనిపించడం లేదు. అసోసియేషన్ తీసుకుంటున్న నష్ట నివారణ చర్యల పట్ల నటీమణులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, 'విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్' తరపున 15 మంది సీనియర్ నటీమణులు తాము తిరిగి అసోసియేషన్ లో చేరబోమని తేల్చి చెప్పారు. ఈ 15 మందిలో అక్కినేని అమలతో పాటు శాంతి బాలచంద్రన్, రంజనీ, సజిత, కుస్రూతీ తదితరులు ఉన్నారు.

మహిళా కళాకారులకు అసోసియేషన్ ద్వారా న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోయిందంటూ వీరు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఇకపై అసోసియేషన్ ను నమ్మే ప్రసక్తే లేదని... ఎట్టి పరిస్థితుల్లో అమ్మలో తిరిగి చేరబోమని ప్రకటనలో పేర్కొన్నారు. తోటి నటి లైంగిక దాడికి గురైతే ఆమెకు న్యాయం చేయాల్సింది పోయి... నిందితుడికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇండస్ట్రీలో మహిళలను ఆట బొమ్మలుగా చూస్తున్నారని... అన్నీ ఏకపక్ష నిర్ణయాలే తీసుకుంటున్నారని చెప్పారు. 

  • Loading...

More Telugu News