sugar: శ్రీకాకుళం జిల్లాలో రేషన్‌కార్డుదారులతో మంత్రి ప్రత్తిపాటి ముఖాముఖీ!
- శ్రీకాకుళం జిల్లాలో ప్రత్తిపాటి పర్యటన
- గత జనవరి నుంచి చక్కెర అందిస్తున్నామన్న మంత్రి
- నేటి నుంచి రెండు కిలోల కందిపప్పు సరఫరా
శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం తోటవాడలో ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా 1100 నెంబరుకు అందిన ఫిర్యాదులపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం రేషన్‌కార్డుదారులతో ముఖాముఖి నిర్వహించి, సంతృప్తి స్థాయి తక్కువగా ఉండడంపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ... తాము గత జనవరి నుంచి రేషన్‌కార్డుదారులకి చక్కెర, మార్చి నుంచి కిలో కందిపప్పు కూడా సరఫరా చేస్తున్నామని తెలిపారు. నేటి నుంచి రెండు కిలోల కందిపప్పు సరఫరా చేస్తున్నామని చెప్పారు. అర కిలో చక్కెర రూ.10, కిలో కందిపప్పు రూ.40కు అందిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో రేషన్‌కార్డుదారులకి పామాయిల్‌తో పాటు మరికొన్ని సరుకులు పంపిణీ చేస్తామని ప్రకటించారు.