Donald Trump: సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి... భారతీయ అమెరికన్ అమూల్ థాపర్ ను ఇంటర్వ్యూ చేసిన డోనాల్డ్ ట్రంప్
- అమెరికా సుప్రీంకోర్టు జస్టిస్ నియామకానికి 25 మందితో జాబితా
- అందులో అమూల్ థాపర్ ఒకరు
- థాపర్ సహా నలుగురితో సమావేశమైన ట్రంప్
- మరో ముగ్గురితో భేటీ అయిన తర్వాత నిర్ణయం
ప్రముఖ భారతీయ అమెరికన్ జడ్జి అమూల్ థాపర్ ను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంటర్వ్యూ చేశారు. ఆ దేశ సుప్రీంకోర్టు జస్టిస్ ఆంటోనీ కెన్నెడీ స్థానంలో నియమించేందుకు ట్రంప్ 25 మందితో జాబితా రూపొందించగా, అందులో అమూల్ థాపర్ కూడా ఉన్నారు. థాపర్ తో పాటు బ్రెట్ కవనాగ్, అమీ కోనే బ్యారెట్, రేమండ్ కెత్లెడ్జ్ ను ట్రంప్ ఇంటర్వ్యూ చేసినట్టు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. మరో ఇద్దరు ముగ్గురుతో భేటీ అయిన తర్వాత సుప్రీంకోర్టు కొత్త జస్టిస్ పై నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ తెలిపారు. జూలై 9న నిర్ణయం ప్రకటిస్తామని, ఎంపికయ్యే వారు అసాధారణ వ్యక్తి అయి ఉంటారని పేర్కొన్నారు.