sensex: పంటలకు మద్దతు ధర పెంచేందుకు కేంద్రం ఆమోదం.. దూసుకుపోయిన స్టాక్ మార్కెట్!
- ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు
- కేబినెట్ నిర్ణయంతో బలపడ్డ ఇన్వెస్టర్ల సెంటిమెంట్
- 267 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలతో ఈ ఉదయం నష్టాలతోనే మార్కెట్లు ప్రారంభమయ్యాయి. అయితే, ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో, లాభాల దిశగా సూచీలు కదిలాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 267 పాయింట్లు పుంజుకుని 35,645కి పెరిగింది. నిఫ్టీ 70 పాయింట్లు లాభపడి 10,770 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ (13.74%), రెలిగేర్ (8.40%), మార్క్ సన్స్ ఫార్మా (6.70%), శోభా లిమిటెడ్ (5.66%), ఐపీసీఏ లేబొరేటరీస్ (5.46%).
టాప్ లూజర్స్:
శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ (-11.83%), ఎన్బీసీసీ ఇండియా (-5.38%), వక్రాంగీ (-4.97%), క్వాలిటీ (-4.84%), ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ (-4.75%).