polavarma: పోలవరం పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
- పోలవరం పనులపై 2015లో స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చిన గ్రీన్ ట్రైబ్యునల్
- ఆ తర్వాత ఆర్డర్ పై స్టే ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
- జూలై 2న ముగిసిన స్టే
అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న రాష్ట్ర పభుత్వానికి ఊరట లభించింది. పనులు శరవేగంగా ముందుకు సాగేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. 2015 చివర్లో పోలవరం పనులపై జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ పై స్టేను మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి సీకే మిశ్రా సంతకం చేశారు. పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆమోద ముద్ర వేయడం, ఉత్తర్వులు జారీ కావడమే ఇక మిగిలింది. స్టాప్ వర్క్ ఆర్డర్ పై ఉన్న స్టే గడువు జూలై 2తో ముగిసిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మళ్లీ స్టే ఇవ్వకపోతే పనులు ఆగిపోయే సమస్య ఉంది. ఇప్పుడు కేంద్రం మరో ఏడాది పాటు స్టేను పొడిగించడంతో... పనులు యథావిధిగా ముందుకు సాగనున్నాయి.