rain: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం
- ఏపీలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం
- తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
- దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు వరకు భూ ఉపరితలంపై ద్రోణి
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచన చేశారు. తూర్పు తీరంలోని ఒడిశా పరిసరాలపై 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని, దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు వరకు భూ ఉపరితలంపై ద్రోణి కొనసాగుతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడుతుందని తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు కమ్ముకున్నాయి.