arrest: శ్రీ చైతన్య కళాశాల డీన్, ఏజెంట్లు అరెస్టు
- తెలుగు రాష్ట్రాల్లో 2016లో కలకలం రేపిన ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ
- విద్యార్థుల నుంచి మొత్తం రూ.35 లక్షలు వసూలు
- లీకేజీ వ్యవహారం వెనుక మొత్తం ఆరుగురు
తెలుగు రాష్ట్రాల్లో 2016లో కలకలం రేపిన ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఈరోజు సీఐడీ మరో ఇద్దరు నిందితులని అరెస్ట్ చేసింది. శ్రీచైతన్య కళాశాల డీన్ వాసు బాబుతో పాటు నారాయణ, శ్రీచైతన్య సంస్థల ఏజెంట్ కమ్మ వెంకట శివనారాయణని అదుపులోకి తీసుకున్నట్లు సీఐడీ అధికారులు తెలిపారు.
ఈ లీకేజీలో మొత్తం ఆరుగురు పాలుపంచుకున్నారని, వారే విద్యార్థులకు ప్రశ్నపత్రం లీక్ చేశారని తెలిపారు. విద్యార్థుల నుంచి ఈ ఆరుగురు కలిసి మొత్తం రూ.35 లక్షలు వసూలు చేశారని చెప్పారు. ఎంసెట్ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడితో వాసుబాబు, శివనారాయణ నిరంతరం సంప్రదింపులు జరిపే వారని వివరించారు.