Chennai: చెన్నైలో 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్'... రెచ్చిపోయిన ఆటో డ్రైవర్లను ఛేజ్ చేసిన పోలీసుల వీడియో!

  • చెన్నై ఔటర్ రింగ్ రోడ్డుపై ఘటన
  • బైకులపై వెళుతూ ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టిన యువకులు
  • అరగంట చేజింగ్ తరువాత అరెస్ట్
చెన్నై ఔటర్ రింగ్ రోడ్డుపై ఆటో డ్రైవర్లు రెచ్చిపోగా, వారిని అదుపు చేసేందుకు పోలీసులు చేసిన చేజింగ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. బైకులపై వెళుతున్న కొందరు యువకులు ఆటోవాలాలను రెచ్చగొట్టడంతో, వారు తమ ఆటోలను అత్యంత భయంకరంగా డ్రైవ్ చేశారు. ఆటోలు దూసుకెళుతుంటే, ఇతర వాహనదారులు భీతిల్లిపోయారు.

దీన్ని గమనించిన పోలీసులు, దాదాపు అరగంట పాటు వారిని వెంబడించి, మెరుపు వేగంతో దూసుకెళ్లి వారిని అరెస్ట్ చేశారు. మొత్తం ఆరు ఆటోలను స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆటోలను వదిలి పరారైన మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ప్రజలను భయానికి గురి చేసిన వారిపై కేసు రిజిస్టర్ చేశారు. తమిళ టీవీ చానళ్లలో ప్రసారమైన ఆ వీడియోను మీరూ చూడవచ్చు.
Chennai
Outer Ring Road
Auto Drivers
Chaseing
Police

More Telugu News