balka suman: ఎంపీ బాల్క సుమన్ లైంగిక దోపిడీ ఆరోపణలపై సీఐ మహేష్ స్పందన
- బాల్క సుమన్ పై అసత్య ప్రచారం
- భార్య స్థానంలో జ్యోతి ఫొటోను పెట్టి ప్రచారం చేస్తున్నారు
- సంధ్య, విజేతలు పలువురిని బ్లాక్ మెయిల్ చేసినట్టు విచారణలో తేలింది
టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ పలువురు మహిళలపై లైంగిక దోపిడీకి పాల్పడ్డారనే వార్తలు సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మంచిర్యాల సీఐ మహేష్ మాట్లాడుతూ, బాల్క సుమన్ పై అసత్య ప్రచారం జరుగుతోందని తెలిపారు. ఫొటోను మార్ఫింగ్ చేశారని... ఆయన భార్య స్థానంలో సంధ్య ఫొటోను జోడించి ప్రచారం చేస్తున్నారని అన్నారు.
బాధితులుగా చెప్పుకుంటున్న బోయిన సంధ్య, విజేతలపై 2018 ఫిబ్రవరి 6న కేసు నమోదు చేశామని చెప్పారు. ఎంపీని ట్రాప్ చేసి, బ్లాక్ మెయిలింగ్ ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వీరిద్దరూ గతంలో పలువురిని బ్లాక్ మెయిల్ చేసి, వేధించినట్టు విచారణలో తేలిందని చెప్పారు. బంజారాహిల్స్ లో కూడా వీరిద్దరిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు.
మరోవైపు, బాల్క సుమన్ పలువురు మహిళలపై లైంగిక దోపిడీకి పాల్పడ్డారని పాత్రికేయులు మల్హోత్రా, సురభి నిర్మల్, న్యాయవాదులు వీఎస్ రావు, ఎంఎస్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసిన సంగతి విదితమే.