Uttar Pradesh: యూపీలో ప్లాస్టిక్ నిషేధం.. ఉత్తర్వులు జారీ
- ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి
- ఉత్తర్వులు జారీ చేసిన యూపీ సర్కార్
- ప్లాస్టిక్ నిషేధం అమలుకు ప్రజల సహకారం అవసరం: యోగి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఈ ఆదేశాల్లో పేర్కొంది. ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యానాథ్ మాట్లాడుతూ, ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లా ప్లాస్టిక్ కవర్లు, కప్పులు, గ్లాసులు వాడడం మానేస్తారని ఆశిస్తున్నానని, ప్లాస్టిక్ నిషేధం అమలుకు ప్రజలందరి సహకారం ఎంతో అవసరమని అన్నారు.
కాగా, మితిమీరిన ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే అనర్థాల దృష్ట్యా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే వీటిపై నిషేధం విధించాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది.