prakash javadekar: టీడీపీకి తెలిసింది అదొక్కటే!: కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఎద్దేవా

  • జనచైతన్య యాత్ర ముగింపు సభలో జవదేకర్
  • మోదీ రైతు పక్షపాతి అని అభివర్ణన
  • కాంగ్రెస్ రైతులను పట్టించుకోలేదన్న మంత్రి
తెలుగుదేశం పార్టీపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం సూర్యపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో జన చైతన్య యాత్ర ముగింపు బహిరంగ సభ నిర్వహించారు. కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ హాజరై మాట్లాడారు. టీడీపీకి వెన్నుపోటు పొడవం తప్ప మరేమీ రాదన్నారు. ప్రధాని మోదీ రైతు పక్షపాతి అని అభివర్ణించారు. కాంగ్రెస్ ఏ ఒక్క నాడూ రైతుల గురించి కానీ, వారి సంక్షేమం గురించి కానీ ఆలోచించలేదని విమర్శించారు. బీజేపీ 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచి కర్షకులపై తమకున్న ప్రేమను చాటుకుందన్నారు.
prakash javadekar
BJP
Suryapet District
Telugudesam

More Telugu News