Rajasthan: ఎఫ్ఐఆర్ లో కుల ప్రస్తావన వద్దు: రాజస్థాన్ హైకోర్టు కీలక ఆదేశాలు
- డీజీపీకి రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలు
- ఎఫ్ఐఆర్, బెయిల్ బాండ్లు, అరెస్ట్ మెమోల్లో కులాలను ప్రస్తావించవద్దు
- కులాతీత సమాజంలో మనం నివసిస్తున్నాం
అరెస్ట్ మెమోలు, ఎఫ్ఐఆర్ లు, బెయిల్ బాండ్లలో కులాన్ని పేర్కొనవద్దని రాజస్థాన్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. ఒక బెయిల్ పిటిషన్ ను విచారిస్తూ... దరఖాస్తులో కులాన్ని ప్రస్తావించడాన్ని కోర్టు తప్పుబట్టింది. మనమంతా కులాతీత సమాజంలో నివసిస్తున్నామని... కులం పేరిట గుర్తింపుకు మనం దూరంగా ఉండాలని సూచించింది. మన రాజ్యాంగం, సీఆర్పీసీలు కుల ప్రాతిపదికన పని చేయవని జస్టిస్ సంజీవ్ ప్రకాశ్ అన్నారు. అయితే, ఎస్సీ, ఎస్టీల విషయంలో మాత్రం ఇది వర్తించదని చెప్పారు.