Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు
- కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం
- తీర ప్రాంతంలో అలల ఉద్ధృతి అధికం
- మత్స్యకారులకు హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఆకాశం మేఘావృతమై ఉంది. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఒడిశా నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీంతో తీర ప్రాంతంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 35 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావం దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా ఉంది.