jobs: భారతీయ విద్యార్థికి రూ.1.2 కోట్ల భారీ పారితోషికంతో గూగుల్‌ ఆఫర్‌

  • ఐఐఐటీ-బెంగళూరులో ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ చేస్తోన్న విద్యార్థి
  • ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెస్టులో ఎంపిక
  • ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్న 6,000 మంది విద్యార్థులు 
  • 50 మంది ఎంపిక

ఐఐఐటీ-బెంగళూరులో ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ చేస్తోన్న ఓ విద్యార్థికి భారీ వేతనంతో జాబ్‌ ఆఫర్‌ వచ్చింది. ఇటీవల గూగుల్‌ నిర్వహించిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెస్టులో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 6,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో 50 మంది ఎంపిక కాగా, భారతీయ విద్యార్థి ఆదిత్య పలివల్‌ (22) కూడా ఆ జాబితాలో ఉన్నాడు.

తమ బెంగళూరు క్యాంపస్‌లో అందిస్తోన్న అత్యుత్తమ విద్య వల్లే తాను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టీమ్‌లో చోటు సంపాదించానని తెలిపాడు. సదరు విద్యార్థికి గూగుల్‌ సంస్థ ఏడాదికి 1.2 కోట్ల రూపాయల భారీ పారితోషకాన్ని అందించనుంది.   

  • Loading...

More Telugu News