CM Ramesh: అప్పటివరకు గడ్డం తీయబోనని శ్రీవారికి మొక్కుకున్నా: సీఎం రమేష్

  • స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరిగేంత వరకు గడ్డం తీయను
  • ఇప్పట్నుంచి మళ్లీ రాజకీయ కార్యకలాపాలను ప్రారంభిస్తా
  • రేపు అనంతపురంలో జరిగే కార్యక్రమానికి హాజరు 
కడప స్టీల్ ఫ్యాక్టరీ సాధన కోసం నిరాహారదీక్ష చేసిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్... మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన జరిగేంత వరకు తాను గడ్డం తీయబోనంటూ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి మొక్కుకున్నానని తెలిపారు. ఈ రోజు స్వామివారిని దర్శించుకున్నానని... ఇక రాజకీయ కార్యకలాపాలను ప్రారంభిస్తానని తెలిపారు. రేపు అనంతపురంలో జరగనున్న పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నానని చెప్పారు. 
CM Ramesh
steel factory
beard

More Telugu News