kr vijaya: నా అసలు పేరు దేవనాయకి .. పేరు అలా మారింది!: కేఆర్ విజయ
- మా అమ్మగారి పేరు కల్యాణి
- మా నాన్నగారి పేరు రామచంద్రన్
- వాళ్ల పేర్లు కలిసొచ్చేలా నా పేరు మార్చుకున్నాను
తెలుగులో ఎన్టీఆర్ .. అక్కినేని వంటి అగ్రకథానాయకులతో కలిసి నటించిన కేఆర్ విజయ, దేవత పాత్రలతో అన్నివర్గాల ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. అందమైన ఆమె రూపం .. చక్కని నవ్వు పౌరాణిక చిత్రాల నుంచి వరుస అవకాశాలు వచ్చేలా చేశాయి. తాజాగా ఆమె 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో మాట్లాడుతూ .. తనకి కేఆర్ విజయ అనే పేరు ఎలా వచ్చిందో ఇలా చెప్పుకొచ్చారు.
"నా అసలు పేరు 'దేవనాయకి' .. ఒకసారి తమిళ సినిమాకి సంబంధించి మేకప్ టెస్ట్ కోసం వెళ్లాను. అక్కడ నాకు ఎమ్.ఆర్.రాధ గారు కలిసి .. 'నీ పేరేంటమ్మా' అని అడిగారు .. 'దేవనాయకి' అని చెప్పాను. 'అయ్యో .. దేవనాయకి ఏంటి? వేరే ఏదైనా మార్చుకో .. విజయ అని పెట్టుకో' అన్నారు. మా అమ్మగారి పేరు 'కల్యాణి' .. మా నాన్నగారి పేరు 'రామచంద్రన్' ఆ ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా కేఆర్ విజయ అని పేరు మార్చుకున్నాను. మా అమ్మగారు మలయాళీ .. మా నాన్నగారి సొంతవూరు చిత్తూరు .. చిత్తూరి నాగయ్య గారి ఇంటిపక్కనే ఉండేవాళ్లం'' అంటూ చెప్పుకొచ్చారు.