whatsapp: కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలతో.. ఫేక్ న్యూస్ వ్యాప్తి కాకుండా వాట్సప్ చర్యలు
- ఫేక్‌న్యూస్‌లతో భారత్‌లో అనేక సమస్యలు
- వాట్సప్ 2.18.204 బీటా వెర్షన్
- ‘అనుమానిత లింక్’ పేరిట కొత్త ఫీచర్
వాట్సప్‌లో వస్తోన్న వీడియోలు, పుకార్లు, ఫేక్‌న్యూస్‌లతో భారత్‌లో అనేక సమస్యలు తలెత్తుతోన్న విషయం తెలిసిందే. ఫేక్ న్యూస్ కారణంగా పలు ప్రాంతాల్లో హత్యలు కూడా జరుగుతున్నాయి. దీంతో ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వాట్సప్‌తో పాటు సోషల్ మీడియా సైట్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఫేక్ న్యూస్ వ్యాప్తి కాకుండా తాజాగా వాట్సప్ పలు మార్పులతో వచ్చింది.
జాతీయ మీడియాలో పేర్కొన్న వివరాల ప్రకారం... వాట్సప్ 2.18.204 బీటా వెర్షన్లో ‘అనుమానిత లింక్’ అనే ఈ ఫీచర్‌ను యాడ్ చేసింది. దీని ద్వారా గ్రూప్‌ల్లో ఫార్వర్డ్ అయ్యే ఫేక్ న్యూస్‌ను యాప్ కనిపెట్టి యూజర్లను హెచ్చరిస్తుంది. అలాగే, యూజర్లు ఆ మెసేజ్‌లను ఫార్వర్డ్ చేసే సమయంలో అది ఏ వెబ్సైట్ లింక్ అనే విషయాన్ని, ఆ సైట్ ప్రామాణికతను పరీక్షిస్తుంది. అలాగే, మన గ్రూప్‌లో షేర్ అయిన మెసేజ్‌ని టైప్ చేసి పంపారా? లేక తమకు వచ్చిన దాన్ని ఫార్వర్డ్ చేసి పంపారా? అనే విషయాన్ని కూడా ఇకపై గుర్తించవచ్చు. ఈ ఫీచర్‌తో పుకార్లను అరికట్టవచ్చని వాట్సప్ ప్రతినిధులు పేర్కొన్నారు.