Hyderabad: తనయుడిని సమర్థిస్తూ.. తొలిసారి మీడియా ముందుకు వచ్చిన కత్తి మహేష్ తండ్రి!
- హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన కత్తి మహేష్
- శ్రీరాముడిపై మహేష్ వ్యాఖ్యలు సరైనవే
- అండగా నిలిచిన తండ్రి ఓబులేసు
కత్తి మహేష్ హైదరాబాద్ బహిష్కరణకు గురైన విషయంలో ఆయన తండ్రి కత్తి ఓబులేసు స్పందించారు. తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన ఆయన, శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామిపై నిప్పులు చెరిగారు. బహిష్కరించాల్సింది తన కుమారుడిని కాదని, పరిపూర్ణానందను దేశం నుంచి తరిమికొట్టాలని డిమాండ్ చేశారు.
దళితుడు కాబట్టే తన కుమారుడి వ్యాఖ్యలపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డ ఓబులేసు, రాముడి గురించి మహేష్ మాట్లాడిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం నిజమని చెప్పారు. రామాయణం ఓ విషవృక్షమని, దాన్ని పూర్తిగా చదివితే రాముడు ఎలాంటి వాడో ప్రతి ఒక్కరికీ అర్థమవుతుందని చెప్పారు. తన కుమారుడు హిందువేనని, ఆస్తికుడని, ప్రస్తుతం భార్యతో కలిసే ఉన్నాడని చెప్పిన ఓబులేసు, సోషల్ మీడియాలో కొందరు కావాలనే తన కుమారుడిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.