FIFA world cup: స్వదేశంలో అడుగుపెట్టిన బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టుకు ఘోర అవమానం

  • క్వార్టర్ ఫైనల్‌లోనే ఇంటి ముఖం పట్టిన బ్రెజిల్
  • దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు
  • రాళ్లు, గుడ్లతో ఆటగాళ్ల బస్సుపై దాడి
  • భద్రతా సిబ్బంది కాల్పులు

ఫి‌ఫా ‌ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్‌లో పరాజయం పాలై కోట్లాది మంది హృదయాలను గాయపరిచిన బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టుకు స్వదేశంలో ఘోర అవమానం ఎదురైంది. స్వదేశం చేరుకున్న ఆటగాళ్లకు అభిమానులు రాళ్లు, గుడ్లతో స్వాగతం పలికారు. వారు ప్రయాణిస్తున్న బస్సుపై గుడ్లతో దాడి చేశారు. రాళ్లు విసిరి హంగామా చేశారు.

గత ప్రపంచకప్‌లో జర్మనీ చేతిలో 7-1తో బ్రెజిల్ ఓటమి పాలైంది. ఆ గాయం అభిమానులను వేధిస్తుండగానే ఈసారి బెల్జియం చేతిలో ఓటమి పాలవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రపంచ అగ్రశ్రేణి జట్టు అయి ఉండీ బెల్జియం చేతిలో ఓడిపోవడాన్ని తట్టుకోలేకపోయిన అభిమానులు అప్పటి నుంచి ఉడికిపోతున్నారు. ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేసిన అభిమానులు బస్సును ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారు ఆందోళన కొనసాగించారు. దీంతో రాళ్ల దాడి నుంచి ఆటగాళ్లను రక్షించేందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News