shakalaka shankar: సినిమాలపై ఇష్టం వల్లనే చదువు సాగలేదు: షకలక శంకర్
- నా చదువే అంతంత మాత్రం
- చిరంజీవి సినిమాలతో చదువు అటకెక్కేసింది
- తెలుగులో తప్ప అన్నింట్లోనూ ఫెయిల్ అయ్యాను
ఇటు బుల్లితెరపైనా .. అటు వెండితెరపైన కమెడియన్ గా షకలక శంకర్ మంచి మార్కులు కొట్టేశాడు. ప్రస్తుతం ఆయన హీరోగా ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ తనకి సంబంధించిన కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
"చిన్నప్పటి నుంచి కూడా నా చదువే అంతంత మాత్రం. అలాంటి పరిస్థితుల్లోనే చిరంజీవిగారి 'హిట్లర్' .. 'మాస్టర్' సినిమాలు వచ్చాయి. క్లాస్ రూమ్స్ లోను చిరంజీవి బొమ్మలని గీస్తూ కూర్చునేవాడిని. దాంతో చదువు అటకెక్కేసింది .. పదో తరగతిలో తెలుగు తప్ప అన్నింటిలోను ఫెయిల్ అయ్యాను. తెలుగు ఒక్కదానిలో పాస్ అయినందుకు మా నాన్న ఇల్లెక్కేసి మరీ 'మావోడు తెలుగులో పాసైపోయాడు' అంటూ డాన్సులు చేశాడు. 'తెలుగు తప్ప మిగతా వన్నీ పాస్ అయినా నిన్ను చంపేసేవాడినిరా .. తెలుగొక్కటి పాసైపోయి నన్ను నిలబెట్టేసినావురా .. ఇక నీ ఇష్టం వచ్చింది చేసుకోరా" అనేశాడంటూ నవ్వేశాడు.