paripoornananda: పరిపూర్ణానందను గృహ నిర్బంధం చేయడం పట్ల కన్నా లక్ష్మీ నారాయణ ఆగ్రహం
- లక్షలాది మంది హిందువులు ఆరాధించే స్వామి పరిపూర్ణానంద
- పాదయాత్ర చేయనివ్వకుండా అడ్డకున్నారు
- జూన్ 9వ తేదీ మరో బ్లాక్ డే వంటిది
- ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి విడుదల చేయాలి
హిందూ ధర్మంపై జరుగుతోన్న దాడులకు నిరసనగా 'ధర్మాగ్రహ యాత్ర' చేస్తానని ప్రకటించిన శ్రీ పీఠం అధిపతి, రాష్ట్రీయ హిందూ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు.
"లక్షలాది మంది హిందువులు ఆరాధించే పరిపూర్ణానంద స్వామిని పాదయాత్ర చేయనివ్వకుండా తెలంగాణ పోలీసులు గృహ నిర్బంధం చేశారు.. మన ప్రజాస్వామ్య దేశంలో జూన్ 9వ తేదీ మరో బ్లాక్ డే వంటిది. దేవుళ్ల గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసే వారిని శిక్షించేలా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయడమే పరిపూర్ణానంద చేసిన తప్పా? ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి పరిపూర్ణానందను గృహనిర్బంధం నుంచి విడుదల చేయాలి" అని ట్వీట్లో పేర్కొన్నారు.