paripoornananda: పరిపూర్ణానంద నగర బహిష్కరణ.. కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
- సిద్ధిపేటలో బీజేపీ, ఏబీవీపీ, ఆరెస్సెస్ ఆందోళన
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
- ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామిని హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ, ఏబీవీపీ, ఆరెస్సెస్ నేతలు, కార్యకర్తలు నగర పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. సిద్ధిపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో, పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి తరలించారు. పట్టణంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
2017 నవంబర్ 1న మెదక్ జిల్లా రాష్ట్రీయ హిందూ సేన ఆవిర్భావ సభలో పరిపూర్ణానందస్వామి ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ... నగర పోలీసులు ఆయనపై నగర బహిష్కరణ వేటు వేశారు. నగరం నుంచి ఆయనను తరలించారు.