sv mohan reddy: హిప్నటైజ్ చేయాల్సిన అవసరం నాకు లేదు: టీజీ వెంకటేష్ కు మోహన్ రెడ్డి కౌంటర్
- చంద్రబాబు చెప్పినదాన్నే లోకేష్ ప్రకటించారు
- రాజకీయాల్లో లోకేష్ కొత్త పంథాను అనుసరిస్తున్నారు
- అభ్యర్థులను ముందుగా ప్రకటించడం వల్ల గెలుపు అవకాశాలు పెరుగుతాయి
కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బుట్టా రేణుక, ఎమ్మల్యే అభ్యర్థిగా ఎస్వీ మెహన్ రెడ్డిని మంత్రి నారా లోకేష్ ప్రకటించడం పట్ల ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆశ్చర్యం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. లోకేష్ ను మోహన్ రెడ్డి హిప్నటైజ్ చేసి ఉంటారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై మోహన్ రెడ్డి అదే స్థాయిలో స్పందించారు. హిప్నటైజ్ చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. రాజకీయాల్లో లోకేష్ కొత్త పంథాను అనుసరిస్తున్నారని... పార్టీ జాతీయ కార్యదర్శి హోదాలోనే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఆయన ప్రకటించారని చెప్పారు. చంద్రబాబు చెప్పనదాన్నే లోకేష్ ప్రకటించారని అన్నారు.
ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడం వల్ల అభ్యర్థుల గెలుపు అవకాశాలు పెరుగుతాయని మోహన్ రెడ్డి తెలిపారు. పార్టీ గెలుపు కోసం తాను ఎవరితోనైనా కలిసి పని చేస్తానని చెప్పారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా జయనాగేశ్వరరెడ్డిని లోకేష్ ప్రకటించినట్టు తెలిపారు.